యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-07-31T00:00:36+05:30 IST

గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్‌ దేవానంద్‌కు చెందిన

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

యాదాద్రి-భువనగిరి: గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్‌ దేవానంద్‌కు చెందిన హైదరాబాద్ నగరంలోని మేడిపల్లిలోని ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసాయి. సోదాల్లో రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డాక్యుమెంట్స్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వెంచర్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. 


కాగా, సబ్ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌గా మోత్కూర్ సబ్ రిజిస్ట్రార్ ఖాదర్ పాషా నియమితులయ్యారు.

Updated Date - 2021-07-31T00:00:36+05:30 IST