నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తహసీల్దార్ నరేందర్, వీఆర్ఏ అభిషేక్‌ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. భూమి మ్యూటేషన్ కోసం రూ.7 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. బాధిత రైతు ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.