నీటి పైపులో నోట్ల కట్టలు.. అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ

ABN , First Publish Date - 2021-11-24T22:39:49+05:30 IST

కర్ణాటకలో పలువురు అధికారులు లంచం తీసుకుంటున్నట్లు పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ ఇంజనీర్ల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కల్బుర్గిలోని జూనియర్ ప్రజా సంబంధాల..

నీటి పైపులో నోట్ల కట్టలు.. అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ

బెంగళూరు: అవినీతి సొమ్మును బీరువాలోనో, సూటుకేసులోనో కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా దాస్తుంటారు. పూర్వం గుంతలు తవ్వి సొమ్ము అక్కడ భద్రపరిచినట్టే ఇప్పుడు కూడా ఇంట్లో స్టోర్ రూముల్లో, బాత్రూల్లో డబ్బు దాచడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాగే అతి తెలివితో అవినీతి సొమ్మును నీటి పైపుల్లో దాచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని కల్బుర్గి ప్రాంతానికి చెందిన ప్రజా సంబంధాల అధికారి ఇంట్లో వెలుగులోకి వచ్చిన దృశ్యం ఇది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.


కర్ణాటకలో పలువురు అధికారులు లంచం తీసుకుంటున్నట్లు పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ ఇంజనీర్ల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కల్బుర్గిలోని జూనియర్ ప్రజా సంబంధాల అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే ఇంట్లో ఎలాంటి అవినీతి సొమ్ము లభించలేదు. అయితే ఇంటి గోడలకు ఆనుకొని ఉన్న నీటి పైపుల్లో అవినీతి సొమ్ము ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఆ పైపును కత్తిరించి తెరవగా బోరు బావి నుంచి నీళ్లు వచ్చినట్లు నోట్ల కట్టలు రావడం ప్రారంభమైంది. పైపులో నుంచి వస్తున్న డబ్బును బకెట్లలో పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.



Updated Date - 2021-11-24T22:39:49+05:30 IST