కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రూ.45,960 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.10,360 నగదు, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర రూ.17,200, డస్ట్‌బిన్‌లో రూ.18,400 గుర్తించారు.