Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి

ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌కుమార్‌

గుంటూరు, అక్టోబరు 26: సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటవేళ్లతో పెకిలించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌కుమార్‌ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ అన్నారు. విజిలెన్స అవేర్‌నెస్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏసీబీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అవినీతి అంతానికై ప్రతిజ్ఞ చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ ఎ.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఏసీబీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అవినీతి నిరోధక శాఖ పూర్తిస్థాయిలో నిస్పక్షపాతంగా పని చేస్తూ అవినీతిపరులపై కొరడా ఝుళిపిస్తుందని, బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరావు, సీఐలు శ్రీధర్‌, రవిబాబు, నాగరాజు, సురేష్‌, అంజిబాబు, మన్మథరావు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement
Advertisement