Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధూళిపాళ్లను కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు

అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించమన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ధూళిపాళ్ల తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు. భూమి బదిలీ కూడా రికార్డుల్లో ఉందని.. ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఏమీ ప్రయోజనం పొందలేదని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ధూళిపాళ్లను తమకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కేసులో మరిన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు వెల్లడించారు. ఆర్డర్స్‌ని ఏసీబీ కోర్టు రిజర్వ్‌ చేసింది. నరేంద్ర బెయిల్‌ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement
Advertisement