30 నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-07-26T07:01:40+05:30 IST

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాడ కృత్తిక మహోత్సవాలు వారికి ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు.

30 నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు
స్వామి సేవలో ఏసీబీ అదనపు డీజీపీ పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు

మోపిదేవి, జూలై 25 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాడ కృత్తిక మహోత్సవాలు వారికి ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉదయం 8 గంటలకు గోపూజతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.  సాయంత్రం 4 గంటలకు వాస్తు హోమం, పరియాజ్ఞికరణం, అంకు రార్పణ, పట్టుపవిత్రాల ఆపాదన, ఆదివాసం జరుగుతాయన్నారు. 31న గోపూజ, సుప్రభాత సేవ, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్టానం, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పట్టుపవిత్రాల సమర్పణ నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 1వ తేదీన సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్టాన, హవనం, పవిత్ర జలప్రోక్షణ, పూర్ణాహుతి, వేదాశీర్వచనాలతో పవిత్రోత్సవాలు ముగుస్తామన్నారు. 2వ తేదీన ఆషాడ కృత్తిక, స్వామివారి జన్మనక్షత్రం ఆడికృత్తి పురస్కరించుకుని ఉదయం 7 గంటలకు తీర్థపుబిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వరపూజ, 9 గంటలకు వల్లీదేవసేన అమ్మవార్లకు శాకంబరి అలంకరణ, 10 గంటలకు విఘ్నేశ్వరపూజ, కలశాభిషేకం, పంచామృతాభిషేకాలు జరుగుతాయన్నారు. సాయంత్రం 3 గంటల నుంచి లక్ష బిల్వార్చన, రుద్రహోమం, శాంతి కల్యాణం, మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహిస్తామన్నారు. 

 స్వామి సేవలో ఏసీబీ అదనపు డీజీపీ

 ఏసీబీ అదనపు డీజీపీ పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు కుటుంబ సమేతంగా ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ ఆధ్వర్యంలో అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.   ప్రధాన అర్చకులు బుద్ధు పవన్‌కుమార శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు ఈవో లీలాకుమార్‌ ఆయనకు అందజేశారు. డీఎస్పీ మహబూబ్‌ బాషా, ఎస్సై మురళీ కృష్ణ ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2021-07-26T07:01:40+05:30 IST