అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-06-13T04:41:36+05:30 IST

అకాడమిక్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చే యాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ట్రస్మా రాష్ట్ర ప్రతినిధులు హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు.

అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి
విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం అందిస్తున్న ట్రస్మా సభ్యులు

కామారెడ్డి, జూన్‌ 12: అకాడమిక్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చే యాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ట్రస్మా రాష్ట్ర ప్రతినిధులు హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రఽభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులను పై తరగతులకు ప్రమో ట్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఇదే పునరావృతం అయితే సమాజానికి చెడు సంకేతాలు పంపినవారం అవుతామని అన్నారు. ఎప్పటికప్పుడు ఉ పాధ్యాయుల అభ్యసన, సామర్థ్యాలను మెరుగుపరుస్తూ రాష్ట్ర విద్యార్థుల కు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలను ఎన్‌సీఆర్‌టీ లో సభ్యులుగా చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షు డు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌, కోశాధికారి రమణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T04:41:36+05:30 IST