ఇకపై సంతకాలు పెట్టేటప్పుడు ఆలోచించండి: ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం

ABN , First Publish Date - 2021-05-07T16:27:05+05:30 IST

ఇకపై ఇతర దేశాలకు చెందిన లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని విషయాలను ఆలోచించి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం తమ ఆటగాళ్లను హెచ్చరించింది.

ఇకపై సంతకాలు పెట్టేటప్పుడు ఆలోచించండి: ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం

ఇకపై ఇతర దేశాలకు చెందిన లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని విషయాలను ఆలోచించి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా కారణంగా భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా నిషేధించడంతో ఐపీఎల్‌లో ఆడిన ఆసీస్‌ క్రికెటర్లంతా చిక్కుకుపోయారు.


నేరుగా వెళ్లలేక మాల్దీవులకు వెళ్లి అక్కడ క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాల్సి వస్తోంది. దీని గురించి తాజాగా ఏసీఏ స్పందించింది. `భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నా. ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు ఇకపై అన్ని అంశాలను ఆలోచించుకోవాలి. ఎదురుకాబోయే సమస్యల గురించి ముందుగానే తెలుసుకోవాలి. కాస్త హోం వర్క్ చేయాలి. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింద`ని ఏసీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ అన్నారు.

Updated Date - 2021-05-07T16:27:05+05:30 IST