సమకాలీన సాహిత్యంలో జాతి వివక్షతపై చర్చించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:53:29+05:30 IST

సమకాలీన సాహిత్యంలో జాతి వివక్ష గురించి చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ పేర్కొన్నారు.

సమకాలీన సాహిత్యంలో జాతి వివక్షతపై చర్చించాలి
సదస్సులో మాట్లాడుతున్న వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్‌

వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్‌

గుంటూరు(విద్య), జూన్‌ 24: సమకాలీన సాహిత్యంలో జాతి వివక్ష గురించి చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ పేర్కొన్నారు.  ఇష్యూష్‌, చాలెంజన్‌ అండ్‌ రెమిడియల్‌ అప్రోచ్‌ ఇన్‌ కాంటెంపరరీ లిటరేచర్స్‌ అనే అంశంపై శుక్రవారం ఏసీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.మోజస్‌ అధ్యక్షత వహించారు. ఆచార్య రాజశేఖర్‌ మాట్లాడుతూ సాహిత్య పరిణామ క్రమాన్ని  యువత తెలుసుకోవాలని, భావి సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులు అధ్యాపకుల్లో, సాహిత్య పరిశోధకుల్లో నూతన ఆలోచనలకు నాంది పలుకుతాయన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు జి.అన్నాషాలిని, విశ్రాంత ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.ముత్యం, డాక్టర్‌ ఎంఎస్‌ శ్రీధర్‌, ఎలిమ్‌ జీవనజ్యోతి, వైజె రిచార్డ్‌, సీహెచ్‌ అనిత, డాక్టర్‌ బియం స్టెల్లా, బి.వాణిగ్రేస్‌, వై.సలోమిమెర్సీ, సీహెచ్‌ ఫోరెన్స్‌, డి.శిరీష, ఎం.ప్రేమలత, ఎన్‌.మౌనిక తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-25T05:53:29+05:30 IST