ఏబీవీపీ పాఠశాలల బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-06T06:23:50+05:30 IST

విద్యారంగం, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఏబీవీపీ నిర్వహించిన పాఠశాలల బంద్‌ మంగళవారం జిల్లాలో విజయవంతమైంది.

ఏబీవీపీ పాఠశాలల బంద్‌ విజయవంతం
పాఠశాల బంద్‌ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 5: విద్యారంగం, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఏబీవీపీ నిర్వహించిన పాఠశాలల బంద్‌ మంగళవారం జిల్లాలో విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారలేదన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేదని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయలేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితం చేసిందని విమర్శించారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేరని, చివరకు స్కావెంజర్లనుకూడా నియమించక పోవడంతో పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విష్ణు, వర్ధన్‌, ప్రమోద్‌కుమార్‌, నాగరాజు, అరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:23:50+05:30 IST