నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-07-27T04:05:29+05:30 IST

ప్రభుత్వం త క్షణమే నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ నాగరాజు

 ధర్నాలో ఏబీవీపీ జాతీయ నేత మనోజ్‌కుమార్‌

నాయుడుపేట టౌన్‌, జూలై 26 :  ప్రభుత్వం త క్షణమే నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ఏబీవీపీ నాయకులు ధర్నా  చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, టీచర్లు, కానిస్టేబుళ్లు, లైబ్రేరి, సైన్స్‌ పోస్టులను చూపకుండా డమ్మీ క్యాలెండర్‌ను విడుదల చేసి నిరుద్యోగులను మోసానికి గురిచేసిందన్నారు. అలాగే గ్రూప్‌ 1, 2లో 36 పోస్టులను విడుదల చేయడం బాధాకరమన్నారు. అంతేగాక గ్రూప్‌ 3, 4 పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ధర్నా వద్దకు స్థానిక ఎస్‌ఐ నాగరాజు చేరుకుని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అనంతరం ఆర్డీవో సరోజినికి ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామిరెడ్డి తరుణ్‌, బాగ్‌ కన్వీనర్‌ భానుప్రకాష్‌, సన్నీ, సహబాగ్‌ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, నగర కార్యదర్శులు కిశోర్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:05:29+05:30 IST