వీఎస్‌యూలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి

ABN , First Publish Date - 2021-02-25T03:30:27+05:30 IST

వీఎస్‌యూలోని డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ బుచ్చి శాఖ ఆధ్వర్యంలో బుధవారం బస్టాండ్‌ సెంటర్‌ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

వీఎస్‌యూలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి
బుచ్చి తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ బుచ్చి శాఖ.

  ఏబీవీపీ బుచ్చి శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ 


బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 24: వీఎస్‌యూలోని డిగ్రీ  విద్యార్థులకు  పరీక్షలు వాయిదా వేయాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ బుచ్చి శాఖ ఆధ్వర్యంలో బుధవారం బస్టాండ్‌ సెంటర్‌ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కోరారు. పట్టణ కార్యదర్శి గోదిన వంశీకృష్ణ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా డిగ్రీ విద్యార్థులకు సిలబస్‌ జరగకపోతే వీసీ, రిజిస్ర్టార్‌ పరీక్షలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వెంకట అఖిల్‌, పెంచలయ్య, కేతన్‌, చందు, సాయి, ఏడుకొండలు, ప్రశాంత్‌, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T03:30:27+05:30 IST