మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం

ABN , First Publish Date - 2020-09-21T07:51:56+05:30 IST

త్వరలో ప్రారంభమయ్యే డిగ్రీ పరీక్షలకోసం విద్యార్థులకు హాస్టల్‌, రవాణా సౌకర్యాలు

మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం

అడ్డుకున్న పోలీసులు, విద్యార్థి నేతల అరెస్టు


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రారంభమయ్యే డిగ్రీ పరీక్షలకోసం విద్యార్థులకు హాస్టల్‌, రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ వద్దకు విద్యా ర్థులు గుంపులుగా నినాదాలు చేసుకుంటూ వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి గోషామహల్‌ ఠాణాకు తరలించారు. ఈ సం దర్భంగా ఏబీవీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి, ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ కోసం దేశంలోని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించడం లేదన్నారు.


ప్రతి ఏడాది మాదిరిగానే ప్రస్తు తం కూడా పరీక్షలు నిర్వహించాలనుకోవడం దారుణ మైన విషయమని మండిపడ్డారు. సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు స్వగ్రామాల్లో ఉన్న పరిస్థి తుల్లో పరీక్షల కోసం దాదాపుగా లక్ష మంది విద్యార్థు లకు రవాణా, హాస్టల్స్‌ సౌకర్యం లేదని, ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు చేరుకునే విద్యార్థులు ఎక్కడ ఉండి పరీక్షలు రాయాలనే విషయంలో అయోమయంలో ఉన్నారని అన్నారు. ఒకే సబ్జెక్టుకు సంబంధించి రెండు పరీక్షలు కాకుండా ఒకే పరీక్షను నిర్వహించడం తోపా టు పరీక్షా సమయాన్ని కుదించాలని కోరారు. కార్యక్ర మంలో మనోహర్‌రెడ్డి, శ్రీను నాయక్‌, విజయ్‌, దేవేం దర్‌, మహేష్‌, నరేందర్‌, కార్తీక్‌, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T07:51:56+05:30 IST