సమృద్ధిగా..వానలు

ABN , First Publish Date - 2022-09-23T05:04:09+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి.

సమృద్ధిగా..వానలు
నిండుకుండలా ఉన్న జూరాల ప్రాజెక్టు

సమృద్ధిగా..వానలు 

- ఉమ్మడి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం 

- 34 మండలాల్లో అత్యధిక వర్షం, 32 మండలాల్లో అధికం

-  ఆరు మండలాల్లో మాత్రమే సాధారణం 

- ఈ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లాకు వర్షసూచనలు

- ఎగువన వర్షాలతో ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద  

వనపర్తి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జూన్‌ నెలలోనే వర్షాలు ప్రారంభం కావ డం.. సెప్టెంబరు నెలాఖరు వరకు వర్షసూచనలు ఉం డటంతో భారీగా వర్షపాతం నమోదవుతోంది. ప్రతీ ఏడాది జూన్‌ మొదటివారంలో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకి.. మూడోవారం వరకు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించేవి. ఈ ఏడాది అనుకున్నదాని కంటే ముందు గానే రెండోవారంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అ ప్పటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీం తో ఉమ్మడి జిల్లాలో 34 మండలాల్లో ఇప్పటివరకు సా ధారణం కంటే అత్యధికం, 32 మండలాల్లో అధిక  వర్ష పాతం నమోదైంది. కేవలం ఆరు మండలాల్లో మాత్ర మే సాధారణ వర్షపాతం నమోదైంది.  జిల్లాలో ప్రధా న ప్రాజెక్టు అయిన జూరాల మే నెలలోనే నిండుకుండ లా మారింది. దాని ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథ కాలు, ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకు న్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టులకు నీటిరాక కొనసాగుతూ నే ఉంది. సెప్టెంబరు నెలాఖరు వరకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. వానాకాలంలో ఎక్కువగా పత్తి, కంది ఇతర ఆరుతడి పంటలు సాగుచేసే ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఈసారి వర్షాలు మేలు చేశాయి.  2017 తర్వాత ఉమ్మడి జిల్లాలో మెజారిటీ మండలాల్లో సా ధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతుండ టంతో పంటల సాగు  పెరిగింది. అలాగే ప్రాజెక్టుల ద్వారా త్వరితగతిన నీరు అందుతుండటంతో వరిసాగు కూడా వానాకాలం సీజన్‌లో భారీగా పెరిగింది. 

ఇదీ పరిస్థితి 

ప్రతీఏటా అధికారులు సాధారణ వర్షపాతాన్ని నిర్ణయిస్తారు. ఈ ఏడు జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సాధారణ వర్షపాతం 340.9 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 496.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గట్టు మండలంలో సాధారణ వర్షపాతం 116 మిల్లీమీటర్ల కాగా.. 258.9 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో అత్యధిక వర్షపాతంగా నమోదైంది. మిగ తా 11 మండలాల్లో అధిక వర్షం కురిసింది. నారా యణపేట జిల్లాలో సాధారణ వర్షపాతం 376 మిల్లీమీటర్లు కాగా.. 677.1 మిల్లీమీటర్ల వర్షం  కురిసింది. మరికల్‌, కృష్ణా మండలాలు మినహా మిగతా అన్నింటిలో సాధారణం కంటే అత్యధిక వర్షం కురిసింది. ఈ రెండు మండలా ల్లో అధిక వర్షం కురిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 16 మండలాలు ఉండగా.. 417.2 మి.మీ సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. 710.8 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. మొత్తం ఎనిమిది మండలాల్లో సాధారణం కంటే అత్యఽ దిక వర్షపాతం నమోదుకాగా.. ఆరు మండలాల్లో అధిక వర్షపాతం, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యింది. నాగర్‌ కర్నూలు జిల్లాలో 20 మండలాలు ఉండగా.. 9 మండ లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 8 మండలాల్లో అధికవర్షపాతం, మూడు మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఈ జిల్లా సగటున 389.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 598.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 384.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 596.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికం, అయిదు మండలా ల్లో అధిక వర్షపాతం, రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. 

ప్రాజెక్టులకు జలకళ... 

 ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది వరద ప్రారంభమయ్యే నాటికే జూరాల ప్రాజెక్టు దాదాపు 8 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. అలాగే జూన్‌ నెలలోనే నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాలకు వరద రాక మొదలైంది. దీంతో నెట్టెంపాడు, భీమా 1,2 ఎత్తిపోతల పథకాలు, కోయిల్‌సాగర్‌ ఎత్తి పోతల పథకంతో పాటు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలు వలకు తుకాలు వేసుకునే సమయానికే పుష్కలంగా నీరు అందింది. జూరాల ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో 700 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చింది. సెప్టెంబరు నెలాఖరు నుంచి ఆక్టోబరు మొదటివారం వరకు కూడా ఎగువ నుంచి వరద సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని లాంటి ప్రధాన ప్రాజెక్టులు నీటితో నిండుకుండలా ఉండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో వరద నిలిచిపోయే సమయానికే వానాకాలం పంట చేతికి వచ్చే అవకాశా లు ఉన్నాయి. యాసంగి ప్రారంభానికి ముందు ప్రాజెక్టు నిండుకుండలా ఉంటే ఆ సీజన్‌లో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. 

 



Updated Date - 2022-09-23T05:04:09+05:30 IST