సమృద్ధిగా సాగు నీరు!

ABN , First Publish Date - 2021-10-26T05:37:29+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు రాబోయే యాసంగిలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివం కమిటీలో నిర్ణయించిన విధంగా సాగునీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

సమృద్ధిగా సాగు నీరు!

యాసంగి సీజన్‌లోనూ ఎస్సారెస్పీ మొత్తం ఆయకట్టుకు సాగునీరు 

ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు 

శివం కమిటీలో నీటి విడుదలపై నిర్ణయం

డిసెంబరు చివరి వారం నుంచి నీటిని విడుదల చేసే అవకాశం

నిజామాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు రాబోయే యాసంగిలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివం కమిటీలో నిర్ణయించిన విధంగా సాగునీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ వరి కోతలు పూర్తయి రైతులు, ప్రజాప్రతినిధుల సమావేశాల అనంతరం డిసెంబరు చివరి నుంచి గానీ, జనవరి మొదటివారం నుంచి గానీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడంతో మొత్తం ఆయకట్టుకు అవసరమైనమేర నీటిని విడుదల చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదలతో పాటు విద్యుత్‌ ఉత్పత్తిని కూడా కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈయేడు భారీగా వచ్చిన వరద

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం పెద్దఎత్తున వ రద వచ్చి చేరింది. జూన్‌ నెలలో మొదలైన వరద ఇంకా కొనసాగుతోంది. జూలై 22న ప్రాజెక్టు నిండడంతో అధికారులు సుమారు 3 నెలలపాటు గేట్లు తెరిచి మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ సంవత్సరం ఎగువ ప్రాంతం నుంచి ఊహించనివిధంగా 667 టీఎంసీల వరద నీరు వచ్చింది. సుమారు 595 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,500ల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గేట్లను మూసివేసి న అధికారులు ప్రస్తుతం విద్యుత్‌ వినియోగం కోసం కాకతీయ కాల్వ ద్వారా 7,500ల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, సరస్వతీ కాల్వ ద్వారా 800ల క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగించి నిలిపివేయనున్నారు. వానాకాలం సాగు దగ్గరపడడం, రైతులంతా వరి కోతల్లో బిజీగా ఉండడం, నీటి విడుదల నిలిపివేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధి లో అక్కడడక్కడ కొన్ని గ్రామాల పరిధిలో సాగునీరు అవసరం కావడంతో ఈనెల 30 వరకు నీటి విడుదల కొనసాగించేందుకు నిర్ణయించారు. రైతులు వరి కోతలు మొదలుపెట్టడం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నేటికీ కొన్ని పొలాలు ఆరకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మొత్తం ఆయకట్టుకు సాగునీరు

ఎస్సారెస్పీతో పాటు దిగువనున్న ఎల్‌ఎండీ, మిడ్‌మానేరులో నీరు పుష్కలంగా ఉండడంతో ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారు లు సిద్ధమవుతున్నారు. నవంబరు నెలలో జరిగే శివం కమిటీలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్సారె స్పీ ఆయకట్టుకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉం డడంతో మొత్తం మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు సీఈ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలో 115 టీఎం సీల నీరు అందుబాటులో ఉం డడంతో యాసంగి సాగుకు ఎన్ని ఎక రాలకు ఇవ్వవచ్చో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో కూడా నీరు పుష్కలంగా ఉండడం.. భూగర్భజ లాలు సైతం ఆశాజనకంగా ఉండడంతో యాసంగిలో మొత్త ం సాగుకు నీటిని అందించేలా ప్రణా ళిక రూపొందిస్తున్నారు. గత సంవత్సరంలాగానే ఎస్సారెస్పీ పరిధిలో పన్నెడున్నర లక్షల ఎకరాలకు సా గునీరు అందించేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రా జెక్టు ఆయకట్టు పరిధిలో వానాకాలం సీజన్‌కు సంబంధిం చిన వరి కోతలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో నెల రోజుల పాటు ఈ వరి కోతలు కొనసాగనున్నాయి. ఆ త ర్వాతనే రైతులు యాసంగి సీజన్‌ పంటల సాగును మొద లుపెట్టనున్నారు. ప్రాజెక్టు పరిధిలో రైతులు వరితో పాటు ఆరుతడి పంటలు సాగుచేయనున్నారు.  

‘శివం’ సమావేశం తర్వాతే తేదీల ప్రకటన

శివం కమిటీ సమావేశం తర్వాత నీటి విడుదల తేదీల ను ప్రకటించనున్నారు. ఎస్సారెస్పీ పరిధిలో డిసెంబరు చి వరి నుంచిగానీ, జనవరి మొదటి వారం నుంచి గానీ యా సంగి సాగుకు నీటి విడుదల చేసేవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాల్వలతో పాటు గుత్ప, అలీసాగర్‌ ఇతర ఎత్తిపోతల పథకాల కు సాగునీరు అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయ కాల్వ పరిధిలోని నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగ ర్‌, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో గల ఆయకట్టు కు సాగునీరు అందేవిధంగా నిర్ణయించారు. ప్రాజెక్టు నిం డా నీరు ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో ఏప్రిల్‌ చివరి వరకు నీటిని అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద భారీగా రావడంతో వానాకాలం కూడా ఎల్‌ఎండీకి ఎగువన ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. అదే పద్ధతిలో యాసంగికి కూడా నీటిని విడుదల చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈనెల 29న మూతపడడనున్న బాబ్లీ గేట్లు

ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ను ఈనెల 29న మూసివేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతీ సంవత్సరం వరద వచ్చే సమయంలో జూలై 1న గేట్లు తెరుస్తారు. వర్షాలు ముగిసి వరద తగ్గిపోయే సమయంలో అక్టోబరు 29న గేట్లను మూసివేస్తారు. ఈసా రి జూన్‌ నుంచే వరద మొదలు కావడంతో నెల రోజుల ముందే బాబ్లీ గేట్లను ఎత్తారు. నేటికీ కొద్ది మొత్తంలో వర ద నీరు వస్తూనే ఉంది. అయితే, ఈనెల 29న బాబ్లీ ప్రాజె క్టు గేట్లను మూసివేయనున్నట్టు ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివా స్‌ తెలిపారు. ఈ సంవత్సరం యాసంగిలో కూడా మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించనున్నామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీళ్లు ఉండడం వల్ల ప్రభు త్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా యాసంగికి నీటి ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-26T05:37:29+05:30 IST