Abn logo
Aug 31 2021 @ 14:18PM

'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను సవరించిన అబుధాబి.. భారత్‌కు మాత్రం..

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను తాజాగా సవరించింది. దీంతో ఈ జాబితాలోని మొత్తం దేశాల సంఖ్య 55కు చేరింది. భారత్‌కు ఈ సారి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు. తాజాగా భూటాన్, డెన్మార్క్, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, ఖతార్, ఒమన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కాగా, 'గ్రీన్ లిస్ట్'లో ఉన్న దేశాల పౌరులకు అబుధాబి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్న సంగతి తెలిసిందే.


అబుధాబి 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాలో ఉన్న 55 దేశాలివే.. 1. అలాబానియా, 2. అమెరికా, 3. ఆస్ట్రేలియా, 4. ఆస్ట్రియా, 5. బహ్రెయిన్, 6. బెల్జీయం, 7. భూటాన్, 8. బ్రూనై, 9. బల్గేరియా, 10. కెనడా, 11. చైనా, 12. కొమొరాస్, 13. క్రొయేషియా, 14. సైప్రస్, 15. చెక్ రిపబ్లిక్, 16. డెన్మార్క్, 17. ఫిన్లాండ్, 18. జర్మనీ, 19. గ్రీస్, 20. హాంగ్‌కాంగ్, 21. హంగేరీ, 22. ఐర్లాండ్, 23. ఇటలీ, 24. జపాన్, 25. జోర్డాన్, 26. కువైత్, 27. కీర్గిజ్‌స్తాన్, 28. లక్సెంబర్గ్, 29. మాల్దీవులు, 30. మాల్టా, 31. మారిషస్, 32. మోల్డోవా, 33. మొనాకో, 34. నెదర్లాండ్స్, 35. న్యూజిలాండ్, 36. నార్వే, 37. ఒమన్, 38. పోలాండ్, 39. పోర్చుగల్, 40. ఖతర్, 41. రొమానియా, 42. శాన్ మారినో, 43. సౌదీ అరేబియా, 44. సెర్బియా, 45. సీషెల్స్, 46. సింగపూర్, 47. స్లోవేకియా, 48. స్లోవేనియా, 49. సౌత్ కోరియా, 50. స్వీడన్, 51. స్వీట్జర్లాండ్, 52. తైవాన్, 53. తజకిస్తాన్, 54. తుర్క్మెనిస్తాన్, 55. ఉక్రెయిన్. ఈ దేశాల ప్రయాణికులకు క్వారంటైన్ ఉండదు. కానీ, అబుధాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి. 

తాజా వార్తలుమరిన్ని...