Abn logo
Sep 10 2021 @ 12:13PM

UAE వచ్చే భారత ప్రయాణికులకు Abu Dhabi కొత్త మార్గదర్శకాలు.. ఇకపై వారు కూడా..

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చే భారత ప్రయాణికులకు అబుధాబి తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇతర ఎమిరేట్స్(దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, ఫుజిరహా) జారీ చేసిన వీసాలు కలిగిన భారత ప్రయాణికులకు అబుధాబిలో ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. అయితే, ప్రయాణికులు అక్కడి కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇతర ఎమిరేట్స్(దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, ఫుజిరహా) జారీ చేసిన అన్ని రకాల వీసాలు(టూరిస్ట్, రెసిడెంట్, విజిట్) కలిగిన భారతీయ ప్రయాణికులకు అబుధాబి విమానాశ్రయంలోకి ఎంట్రీ ఉంటుంది. అక్కడి ప్రొటోకాల్‌ను అనుసరించడం తప్పనిసరి "  అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. 


ఇవి కూడా చదవండి..

Texasలో హాట్ టాపిక్.. ఈ రెస్టారెంట్ Wifi పాస్‌వర్డ్ ఏంటో మీరు చెప్పగలరా..?

ఫ్లాట్‌లో NRI భార్య దారుణ హత్య.. విదేశాల్లో ఉన్న భర్త.. ‘టీ కప్పుల’తో వీడిన మర్డర్ మిస్టరీ..! 

అలాగే ప్రయాణికులు తప్పకుండా పాటించాల్సి నిబంధనలను కూడా వెల్లడించింది. 

* బయల్దేరడానికి ముందు స్వదేశంలోని విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.

* ఐసీఏ అనుమతి తప్పనిసరి. అనుమతి పొందిన తర్వాత ఐసీఏ స్మార్ట్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. యూఏఈ పౌరులకు దీని నుంచి మినహాయింపు.

* విమానాశ్రయం నుంచి బయల్దేరడానికి ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలి.

* జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా గుర్తింపు పొందిన లాబొరేటరీ నుంచి తీసుకున్నదై ఉండాలి. దానిపై క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి.

* అబుధాబి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.

* టీకా తీసుకున్న ప్రయాణికులు తమ బస వ్యవధిని బట్టి 4, 8వ రోజు మళ్లీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది

* వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులకు క్వారంటైన్ ఉంటుంది. ఆ సమయంలో తప్పనిసరిగా వారు మెడికల్ రిస్ట్‌బ్యాండ్ ధరించాలి. 9వ రోజున మళ్లీ పీసీఆర్ పరీక్ష ఉంటుంది. 16 ఏళ్లలోపు వారికి దీని నుంచి మినహాయింపు ఉంది.

* టీకాలు తీసుకోని ప్రయాణికులు ఎవరైతే తమ జర్నీని ఇతర ఎమిరేట్స్‌కు కొనసాగించాలనుకుంటే ఎయిర్‌పోర్టు వారు ఏర్పాటు చేసిన ట్యాక్సీ లేదా బస్సులలో మాత్రమే ప్రయాణించాలి.


తాజా వార్తలుమరిన్ని...