మద్యం ప్రియులకు అబుధాబి షాక్ !

ABN , First Publish Date - 2020-09-22T15:43:49+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబి మద్యం ప్రియులకు లైసెన్సులు జారీ చేసే వ్యవస్థను ఎత్తేసింది. దీంతో ఇకపై ఇక్కడ మద్యం కొనుగోలు, తరలింపు, నిల్వలకు ప్రత్యేక లైసెన్సులు పొందాల్సిన అవసరం ఉండబోదు.

మద్యం ప్రియులకు అబుధాబి షాక్ !

అబుధాబిలో మద్యం లైసెన్సింగ్‌ వ్యవస్థ రద్దు

అబుధాబి, సెప్టెంబరు 21 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబి మద్యం ప్రియులకు లైసెన్సులు జారీ చేసే వ్యవస్థను ఎత్తేసింది. దీంతో ఇకపై ఇక్కడ మద్యం కొనుగోలు, తరలింపు, నిల్వలకు ప్రత్యేక లైసెన్సులు పొందాల్సిన అవసరం ఉండబోదు. ఈమేరకు వివరాలతో కూడిన ఉత్తర్వులు వారం క్రితమే మద్యం పంపిణీదారులు, దుకాణదారులకు అందాయి. వాటి ప్రకారం.. 21 ఏళ్లకు పైబడిన వారికే మద్యాన్ని విక్రయిస్తారు. మద్యాన్ని ఇళ్లు, ప్రభుత్వ అనుమతులు పొందిన బార్లు, హోటళ్లు, క్లబ్‌లలో మాత్రమే తాగాలి. ఇక్కడి ముస్లింలు మద్యం కొనడంపై అమల్లో ఉన్న నిషేధాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. 


Updated Date - 2020-09-22T15:43:49+05:30 IST