గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. 73 దేశాల వారికి నో క్వారంటైన్.. భారత్‌కు మాత్రం..

ABN , First Publish Date - 2021-12-26T14:55:55+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబి తాజాగా మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది. ఈ జాబితాలో 73 దేశాలకు చోటు కల్పించింది.

గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. 73 దేశాల వారికి నో క్వారంటైన్.. భారత్‌కు మాత్రం..

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి తాజాగా మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది. ఈ జాబితాలో 73 దేశాలకు చోటు కల్పించింది. ఈ దేశాల నుంచి అబుధాబి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే, ఈ జాబితాలో భారత్‌ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక గ్రీన్‌లిస్ట్‌లోని 73 దేశాల నుంచి వచ్చే ప్రణికులకు కరోనా నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించింది. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే జర్నీకి 48 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అలాగే అరైవల్ సమయంలో కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్ష ఉంటుంది. వ్యాక్సినేషన్ పూర్తైన ప్రయాణికులు అబుధాబి వచ్చిన ఆరు రోజుల తర్వాత మరోసారి కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. టీకా తీసుకోని ప్రయాణికులకు ఆరు, తొమ్మిదో రోజున రెండు కరోనా పరీక్షలు ఉంటాయి. ఈ నిబంధనలు ఆదివారం(డిసెంబర్ 26) నుంచే అమల్లోకి వచ్చాయి. 


అబుధాబి గ్రీన్‌లిస్ట్‌లోని 73 దేశాలివే..  

•    Albania

•    Armenia

•    Australia

•    Austria

•    Azerbaijan

•    Bahrain

•    Belarus

•    Belgium

•    Bosnia and Herzegovina

•    Brazil

•    Bulgaria

•    Burma

•    Cambodia

•    Canada

•    China

•    Croatia

•    Cyprus

•    Czech Republic

•    Denmark

•    Finland

•    France

•    Georgia

•    Germany

•    Greece

•    Hong Kong (SAR)

•    Hungary

•    Indonesia

•    Iran

•    Iraq

•    Israel

•    Italy

•    Japan

•    Jordan

•    Kazakhstan

•    Kuwait

•    Kyrgyzstan

•    Laos

•    Latvia

•    Lebanon

•    Luxembourg

•    Malaysia

•    Maldives

•    Netherlands

•    Norway

•    Oman

•    Papua New Guinea

•    Philippines

•    Poland

•    Portugal

•    Qatar

•    Republic of Ireland

•    Romania

•    Russia

•    Saudi Arabia

•    Serbia

•    Singapore

•    Slovakia

•    Slovenia

•    South Korea

•    Spain

•    Sweden

•    Switzerland

•    Syria

•    Taiwan, Province of China

•    Tajikistan

•    Thailand

•    Yemen

•    Turkey

•    Turkmenistan

•    Ukraine

•    United Kingdom

•    United States of America

•    Uzbekistan


Updated Date - 2021-12-26T14:55:55+05:30 IST