యూపీ మళ్లీ బీజేపీదే: ఏబీపీ సీ ఓటర్ సర్వే

ABN , First Publish Date - 2022-01-11T03:04:21+05:30 IST

న్యూఢిల్లీ: యూపీ మళ్లీ బీజేపీదేనని ఏబీపీ సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది.

యూపీ మళ్లీ బీజేపీదే: ఏబీపీ సీ ఓటర్ సర్వే

న్యూఢిల్లీ: యూపీ మళ్లీ బీజేపీదేనని ఏబీపీ సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 235 స్థానాలు దక్కించుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 41.5% ఓటింగ్ శాతం దక్కవచ్చని ఒపీనియన్ పోల్‌ ద్వారా వెల్లడించింది. అఖిలేష్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి 157, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 16, కాంగ్రెస్‌కు పది లోపు స్థానాల్లో విజయం దక్కవచ్చని సర్వే తేల్చింది. 


ఇక మిగతా రాష్ట్రాల సంగతి చూస్తే మణిపూర్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని సర్వే తేల్చింది. మణిపూర్‌లో ఈ సారి హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీకి 27, కాంగ్రెస్‌కు 26 స్థానాలు దక్కే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 


ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని సర్వే తేల్చి చెప్పింది. బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 36 స్థానాలు దక్కే అవకాశముంది. 


గోవాలో బీజేపీకే ఆధిక్యం దక్కనుందని సర్వే తేల్చింది. బీజేపీకి 23 స్థానాలు దక్కనుండగా, ఆప్‌కు 9, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కనున్నాయని అంచనా వేసింది.    


పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 58, కాంగ్రెస్‌కు 43 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. శిరోమణి అకాలీదళ్‌కు 23, బీజేపీకి 3 స్థానాలు దక్కే అవకాశముందని సర్వే తేల్చింది. 

Updated Date - 2022-01-11T03:04:21+05:30 IST