60 ఏళ్లు పైబడిన వారి Work Permits రెన్యువల్.. ప్రవాసులకు ఎదురవుతున్న కొత్త సమస్య ఇదే!

ABN , First Publish Date - 2022-02-08T15:45:06+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ 60 ఏళ్లు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను ఆదివారం(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభించింది.

60 ఏళ్లు పైబడిన వారి Work Permits రెన్యువల్.. ప్రవాసులకు ఎదురవుతున్న కొత్త సమస్య ఇదే!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 60 ఏళ్లు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను ఆదివారం(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభించింది. అయితే, ఈ సందర్భంగా ప్రవాసులకు ఓ కొత్త సమస్య ఎదురవుతోంది. కేవలం కువైత్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల్లో బీమా పాలసీ తీసుకున్న వారికి మాత్రమే వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేస్తోంది. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీ తీసుకుని ఉంటే మాత్రం వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్‌ను నిరాకరిస్తుంది. దీంతో ఇతర కంపెనీల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రవాసులకు వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకోవడం సమస్యగా మారుతోంది. కనుక వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకోవాలనుకునే ఈ కేటగిరీ ప్రవాసులు కువైత్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల్లో మాత్రమే బీమా పాలసీ తీసుకోవాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) సూచించింది. ఇక ఇప్పటికే కువైత్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కేటగిరీ ప్రవాసులకు పాలసీ ధృవపత్రాలు జారీ చేయడం మొదలెట్టాయి. 


60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమాకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పీఏఎం వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించింది. అలాగే ఈ కేటగిరీ ప్రవాసుల బీమా రుసుమును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ 500 కువైటీ దినార్లుగా(రూ.1.23లక్షలు), ఇతర చార్జీల రూపంలో మరో 3.5 కేడీలు(రూ.864) కలిపి మొత్తం 503.5 కువైటీ దినార్లు(రూ.1.24లక్షలు) చెల్లించాలి. ఇలా వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు, బీమా పాలసీ రుసుముతో కువైత్‌కు ఈ ఏడాది ఏకంగా 42.2 మిలియన్ కువైటీ దినార్ల(రూ.1,041కోట్లు) ఆదాయం సమకూరనుంది.  

Updated Date - 2022-02-08T15:45:06+05:30 IST