ఎంట్రీ ఆంక్షల తొలగింపుతో Kuwait కు భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి.. 5 నెలల్లోనే ఏకంగా..

ABN , First Publish Date - 2022-01-29T13:52:53+05:30 IST

మహమ్మారి కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైత్ గతేడాది జూలై చివరి వరకు ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఎంట్రీ ఆంక్షల తొలగింపుతో Kuwait కు భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి.. 5 నెలల్లోనే ఏకంగా..

కువైత్ సిటీ: మహమ్మారి కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైత్ గతేడాది జూలై చివరి వరకు ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్-19 ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఆగస్టు 1 నుంచి ప్రయాణాలపై ఆంక్షలను తొలగించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులను తమ దేశానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇలా ప్రవాసులకు కువైత్ తలుపులు తెరవడంతో ఒక్కసారిగా ఆ దేశానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగిపోయింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఐదు నెలల వ్యవధిలో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఏకంగా 25 లక్షల మందికి పైగా రాకపోకలు కొనసాగించారు. వీరిలో 13.77 లక్షల మంది పౌరులు, నివాసితులు కువైత్ నుంచి ఇతర దేశాలకు వేళ్తే.. 11.80 లక్షల మంది వీదేశీయులు ఆ దేశానికి వచ్చారు. అలాగే ఈ ఐదు నెలల్లో కువైత్ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 22,500 విమాన సర్వీసులు నడిచాయి. వీటిలో 11,228 విమానాలు బయటి దేశాల నుంచి కువైత్‌కు రాగా.. 11,276 విమానాలు కువైత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాయి. 

Updated Date - 2022-01-29T13:52:53+05:30 IST