ఖేదం.. మోదం..

ABN , First Publish Date - 2022-01-28T07:05:19+05:30 IST

నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా చేయాలంటూ గురువారం పలు సంఘాల ఆధ్వర్యంలో రెండోరోజు నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఖేదం.. మోదం..
తహసీల్దార్‌కు వినతిపత్రమిస్తున్న బీసీ సంఘ నాయకులు

నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా చేయాలంటూ గురువారం   పలు సంఘాల ఆధ్వర్యంలో రెండోరోజు నిరసన ప్రదర్శనలు జరిగాయి. అఖిలపక్షం, జనసేన నాయకులు ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ నాయకులు కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  ఇటు భీమవరంను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో గురువారం నాడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కృషిని అభినందిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  నిర్వహించిన సదస్సులో అన్ని హంగులున్న భీమవరానికే హోదా దక్కడంపై వక్తలు హర్షం వ్యక్తం చేశారు.


నరసాపురాన్నే ప్రకటించాలి

మొగల్తూరు/నరసాపురం, జనవరి 27: జిల్లా కేంద్రాన్ని నరసాపురంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం మొగల్తూరులో ఆ సంఘ నాయకులు ఆందోళన నిర్వహించి ప్రదర్శనగా వెళ్ళి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చంటి, మండల కార్యదర్శి జక్కంశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు బర్రి రామస్వామి, కొల్లాటి బోగరాజు  మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నూతన జిల్లాలను డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే కేవలం పశ్చిమ జిల్లా కేంద్రాన్ని నరసాపురంలో కాకుండా భీమవరంలో ప్రకటించడం అన్యాయమన్నారు. నరసాపురం జిల్లా కేంద్రం కావాలని కోరుతూ శుక్రవారం చేపట్టే బంద్‌కు మద్దతు ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆలపాటి నాగేశ్వరరావు, తాతాజీ, ముత్యాలరావు, కౌరు శ్రీనివాసరావు, రాయుడు కృష్ణా రావు, గుడాల శ్రీను, దొంగ లక్ష్మీనారాయణ, బొక్క సత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం నరసాపురం లోనే ఏర్పాటు చేయాలంటూ గురువారం టీడీపీ పట్టణంలో కొవ్వొత్తుల, కాగడాల ప్రదర్శన నిర్వహించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల కండువాలు ధరించి పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు గుబ్బల నాగరాజు, జోగి పండు, కొప్పాడ రవి, జక్కం శ్రీమన్నా రాయణ, కొల్లు పెద్దిరాజు, సంకు భాస్కర్‌, పాపారావు, పద్మా తదితరులు పాల్గొన్నారు. 


భీమవరమే గర్వకారణం!

భీమవరం, జనవరి 27 :  జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేయడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు మద్దతుగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కృషిని అభినందిస్తూ పెద్ద సంఖ్యలో పట్టణంలో ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం పంచారామ క్షేత్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ తిరుమల ఏడుకొండలు, మండల పరిషత్‌ అధ్యక్షుడు పేరిచర్ల విజయ నరసింహరాజు, వైసీపీ నాయకులు తోట భోగయ్య, కోడే యుగంధర్‌, కొల్లి ప్రసాద్‌  మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్నందునే ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడి ఒప్పించారన్నారు. ర్యాలీలో పార్టీ నాయకులు తోట భోగయ్య, చిగురుపాటి రాజు, చిగురుపాటి సందీప్‌, ఆకుల లక్ష్మి,  కె. రమణ,  గూడూరి ఓంకార్‌, నాగరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 

 జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణాన్ని ప్రకటించడం పట్ల భీమవరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, స్వచ్ఛంద సంస్థల సదస్సు అభినందించింది. గురువారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణగుప్త సదస్సు ప్రారంభించి మాట్లాడుతూ అన్ని హంగులున్న భీమవరం పట్టణం జిల్లాలోనే ఒక సుస్ధిర స్ధానం సంపాదించుకున్నదని, కృషి చేసిన భీమవరం ఎమ్మెల్యే  శ్రీనివాస్‌, శాసనమండలి చైర్మన్‌  మోషేన్‌రాజు  అభినందనీయులన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ రంగసాయి, ఫార్వర్డ్‌బ్లాక్‌ అధ్యక్షులు లంకా కృష్ణమూర్తి, కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌,  రైతు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, చాంబర్స్‌ నాయకులు, కిరాణా మర్చంట్‌, ప్యాడి మర్చంట్స్‌, ఐస్‌ ఫ్యాక్టరీ అసోసియేషన్‌, ప్రైవేటు విద్యా సంస్థల సంఘ నాయకులు హర్షం తెలిపారు.




Updated Date - 2022-01-28T07:05:19+05:30 IST