రష్యాకు రాజధానిగా తొలుత ఏ నగరం ఉండేదో తెలుసా? తరువాత ఎలాంటి మార్పులొచ్చాయంటే..

ABN , First Publish Date - 2022-03-05T17:58:53+05:30 IST

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా..

రష్యాకు రాజధానిగా తొలుత ఏ నగరం ఉండేదో తెలుసా? తరువాత ఎలాంటి మార్పులొచ్చాయంటే..

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం తర్వాత చాలా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా మారాయి. కొన్ని దేశాలు రష్యాతో కొన్ని విషయాల్లో సంబంధాలను తెంచుకున్నాయి. అయినా రష్యా ఆగకుండా ఉక్రెయిన్‌పై దాడి చేస్తూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా పలు మార్పులకు గురైంది. రష్యా రాజధాని కూడా చాలాసార్లు మారిపోయింది. రష్యా చరిత్రలో ఆశ్చర్యకరమైన పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  ఇంతకుముందు రష్యా రాజధాని మాస్కో కాదు.. పెట్రోగ్రాడ్. ఈ పెట్రోగ్రాడ్ నేటి సెయింట్ పీటర్స్‌బర్గ్, మార్చి 5న రాజధాని మాస్కోగా మారింది. ఈ మార్పు 1918 సంవత్సరంలో జరిగింది. రష్యాకు పశ్చిమ తీరంలో ఉన్న ఈ నగరం దేశంలోని అతిపెద్ద ఓడరేవు. 


అందమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందినది. డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం సెయింట్ పీటర్స్‌బర్గ్ అని పేరొందిన ఈ నగరం 1991 వరకు లెనిన్‌గ్రాడ్‌ పేరుతో పిలిచేవారు. ఈ నగరం పేరు కాలానుగుణంగా మారింది. 1991లోఈ నగరం.. దాని పాత పేరు సెయింట్ పీటర్స్‌బర్గ్‌గా తిరిగి మారింది. 1712 నుండి 1918 వరకు, జార్ పాలనలో సెయింట్ పీటర్స్‌బర్గ్ రష్యా రాజధానిగా ఉండేది. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంటే సెయింట్ పీటర్స్ కోట. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను 1703లో యూరోపియన్ పాలకుడు పీటర్- I కనుగొన్నారు. జర్మన్ భాషలో సెయింట్ పీటర్స్‌బర్గ్ అని పేరు పెట్టిన మొదటి వ్యక్తి పీటర్. దీనికి అతని పేరు పెట్టారు, కానీ రష్యన్ పేరు పెట్టాలనే అభిప్రాయం కారణంగా ఈ పేరును మార్చారు. 1914లో ఈ నగరం పేరు పెట్రోగ్రాడ్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 1917 వరకు పెట్రోగ్రాడ్.. రష్యా విప్లవానికి బలమైన కోటగా ఉంది. 1918లో మాస్కో... రష్యా రాజధానిగా ఏర్పడింది. అయినప్పటికీ ఆ తరువాత కూడా ఈ నగరం పేరు మార్చే ప్రక్రియ కొనసాగింది. 1924 లో రష్యా విప్లవ నేత లెనిన్ మరణంతో అతని గౌరవార్థం నగరానికి లెనిన్గ్రాడ్ అని పేరు మార్చారు. అయితే రష్యాకు చెందిన చాలామంది ఈ కమ్యూనిస్ట్ పేరుతో ఏకీభవించలేదు. ఈ కారణంగా 1991లో ఆ నగరానికి తిరిగి సెయింట్ పీటర్స్‌బర్గ్‌గా పేరు మార్చారు.



Updated Date - 2022-03-05T17:58:53+05:30 IST