జాతీయ రహదారి జలమయం

ABN , First Publish Date - 2021-09-29T05:50:29+05:30 IST

వర్షం తగ్గినా గుండేరు వాగు వరద ఉధృతితో పలు గ్రామాల్లో తాటాకిళ్లు, రేకుల షెడ్లు నేలకొరిగాయి.

జాతీయ రహదారి జలమయం
జాతీయ రహదారిపై వరద నీటిలో రాకపోకలు

దెందులూరు, సెప్టెంబరు 28: వర్షం తగ్గినా గుండేరు వాగు వరద ఉధృతితో పలు గ్రామాల్లో తాటాకిళ్లు, రేకుల షెడ్లు నేలకొరిగాయి. దెందులూరు సైఫిన్‌ వద్ద వాగుకు గండి పడి దళిత వాడకు రాకపోకలు నిలిచిపోయాయి. సీతంపేట కాల్వకు గండి పడింది.  సత్యనారాయణపురం సమీపంలో గుండేరు వాగు, నక్కల వాగు వరదతో మం గళవారం జాతీయ రహదారి నీట మునిగింది. ఎమ్మెల్యే  కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీపీ సుమలత, జడ్పీటీసీ లీలా నవకాంతం పరిశీలించారు. దెందులూరు, సత్యనారా యణపురం గ్రామాల్లో నీట మునిగిన పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు.పలు గ్రామాల్లో 8 ఇళ్లు వర్షాలకు దెబ్బ తిన్నాయి. చెరువులు నిండి గండ్లు పడ్డాయి.


ఉధృతంగా తమ్మిలేరు.. తగ్గని గుండేరు 

పెదవేగి: గులాబ్‌ తాకిడికి గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. గ్రామాల్లో రహదారులు ధ్వంసమై, నడవడానికి వీల్లేని స్థితి నెలకొంది. తమ్మిలేరు, గుండేరు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. విజయరాయి – బలివే రహదారి కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తమ్మిలేరువైపు వెళ్ళకుండా అధి కారులు చర్యలు తీసుకున్నారు. పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌  గ్రామాల్లో పర్యటించారు. గుండేరువాగు ఉధృతికి తాళ్ళగోకవరం, వేగివాడ, ముండూరు తదితర గ్రామాల్లో  పొలాలు ముంపునకు గురయ్యాయి.

Updated Date - 2021-09-29T05:50:29+05:30 IST