ఈ ఆటో డ్రైవర్‌ ఆదర్శనీయుడు

ABN , First Publish Date - 2022-07-20T06:06:07+05:30 IST

జాతీయ రహదారిపై గోతులను తానే స్వయంగా పూడుస్తూ ప్రజాసేవ చేస్తున్న ఆటోడ్రైవర్‌ రాముడు.

ఈ ఆటో డ్రైవర్‌ ఆదర్శనీయుడు
గోతులను స్వచ్ఛందంగా పూడుస్తున్న ఆటో డ్రైవర్‌ రాముడు

మండవల్లి, జూలై 19: జాతీయ రహదారిపై గోతులను తానే స్వయంగా పూడుస్తూ ప్రజాసేవ చేస్తున్న ఆటోడ్రైవర్‌ రాముడు. మంగళవారం మండవల్లి జాతీయ రహదారిపై గోతులను గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ బుద్దల రాముడు పూడ్చివేశాడు. నిత్యం  రహదారిపై గోతుల్లోపడి పలువురు ప్రమా దాలకు గురవుతున్న ఘటనలు చూసిన రాముడు రోడ్డు నిర్మాణంలో వదిలి వేసిన కంకర, చిప్స్‌ పోగుచేసి ఆటోలో చేరవేసుకుని రెండు రోజులుగా గుంతలను స్వచ్ఛందంగా పూడుస్తున్నాడు. నిత్యం ఆటో నడిపితే గాని జీవనం సాగించలేని వ్యక్తి ప్రజా శ్రేయస్సును కోరి గుంతలను పూడ్చడం పట్ల పలువురు వాహనదార్లు, ప్రజలు, ప్రజాస్వామ్య పరిరక్షణ సభ్యులు  భాస్కరరావు, టి.అప్పారావు అతనిని అభినందించారు.

Updated Date - 2022-07-20T06:06:07+05:30 IST