సీ పీ ఎస్ రద్దు కు ఉద్యోగుల ఉప్పెన: దాముక కమలాకర్

ABN , First Publish Date - 2021-12-06T00:25:59+05:30 IST

సీపీఎస్ పింఛను పథకం ను రద్దు చేసే వరకు తమకు విశ్రాంతి అన్నదే లేనే లేదనీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు దాముక కమలాకర్ స్పష్టం చేశారు.

సీ పీ ఎస్ రద్దు కు ఉద్యోగుల ఉప్పెన: దాముక కమలాకర్

హైదరాబాద్: సీపీఎస్ పింఛను పథకం ను రద్దు చేసే వరకు తమకు విశ్రాంతి అన్నదే లేనే లేదనీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు దాముక కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా కు గానూ నూతన అధ్యక్షున్ని నియమించారు. ఎస్ సీ కార్పొరేషన్ లో సహాయక నిర్వాహకులు గా మేడ్చల్ జిల్లా కు పని చేస్తున్న జీ బాబా వినోద్ కుమార్ కు ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ ఇప్పటికీ సీ పీ ఎస్ శ్రేణులకు భవితవ్యం ఆగమ్య గోచరంగా నే ఉందన్నారు. 


తమ సొమ్ము ఎక్కడ జమ ఐతుంది, ఎంత ఉంది, అవసరానికి ఎలా వాడుకోవాలి ఆన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి నెలకొన్నదనీ ఆవేదన వ్యక్తంచేశారు. సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ..సీ పీ ఎస్ రద్దుకు ఎస్..అనే సందర్భం ఖచ్చితంగా వస్తుందని, ఆ సమయం అసన్న మైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల పై చిలుకు న్యూ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కు కొత్త జీవితమే అని ఆశా భావం వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు ఎన్ పీ ఎస్ క్విట్ ఇండియా అని నిరంతరం నినదిస్తూ పాత పింఛను పథకం ను పునరుద్ధరించాలని అసంఖ్యాకంగా గళం వినిపిస్తున్నారనీ అన్నారు. 


హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జీ బాబా వినోద్ కుమార్ మాట్లాడుతూ..ప్రతీ ఉద్యోగి లో ఆశావాహ దృక్పథం ఉంటుందని, సీ పీ ఎస్ ఎలా ఐతే ప్రవేశించిందో.. అలాగే నిష్క్రమణ కూడా తధ్యం అని అది సాధ్యం అయ్యే వరకు అలుపు లేని పోరాటమే అన్నారు.సీ పీ ఎస్ ఉద్యోగుల్లో , తమకు పాత పింఛను కావాలి ఆన్న అలజడి పెను ఉప్పెన గా మారే అవకాశం లేకపోలేదని అన్నారు.

Updated Date - 2021-12-06T00:25:59+05:30 IST