ఆన్‌లైన్‌లో కలెక్టర్‌ ఖాతాకు రూ.1.03 కోట్ల విరాళాలు

ABN , First Publish Date - 2020-04-10T10:58:14+05:30 IST

కరోనా నియంత్రణకు మానవతావాదులు ముందుకొస్తున్నారు.

ఆన్‌లైన్‌లో కలెక్టర్‌ ఖాతాకు రూ.1.03 కోట్ల విరాళాలు

చెక్కుల రూపంలో రూ.12.41 లక్షలు

సీఎం సహాయ నిధికి రూ.24.41 లక్షలు


అనంతపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యో తి): కరోనా నియంత్రణకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. జిల్లాలో పలువురు విరాళా లు అందజేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు గురువారం తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ని రుపేదలు, కూలీలు, కార్మికులు, చిరువ్యాపారు లు తదితరులు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. వారందరికి వసతి, భోజనంతో పాటు ఇతర త్రా రోజువారి సౌకర్యాల కల్పన నిమిత్తం పలువురు ఆపన్నహస్తం అందించేందుకు ముందు కు రావటం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్‌ ఖాతా, ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీస్థాయిలో విరాళాలు అందించారన్నారు. ప్రభు త్వ సాయానికితోడు దాతలు గతనెల 26 నుం చి ఈనెల 8 వరకు జిల్లా కలెక్టర్‌ సహాయ నిధి ఆన్‌లైన్‌ ఖాతాకు రూ.1.03 కోట్లు అందించారన్నారు. 


చెక్కుల రూపంలో రూ.12.41 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.24.41 లక్షలు విరాళంగా అందజేశారన్నారు. కలెక్టరేట్‌లోని రె వెన్యూ భవన్‌లో మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిలకు అనంతపురం నగరపాలక సం స్థ మాజీ డిప్యూటీ మేయర్‌ శ్రీరాములు రూ. ల క్ష, విశ్రాంత మున్సిపల్‌ ఇంజనీర్‌ పెరుమాల్‌ రూ.50 వేలు అందజేశారు. కలెక్టర్‌ సహాయ ని ధికి తన పెన్షన్‌ డబ్బు నుంచి రూ.35 వేల చె క్కును కలెక్టరేట్‌ విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్‌ విజయరాఘవన్‌ అందజేశారు. ఎస్‌ఎ్‌సబీఎన్‌ కాలేజీ కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ శివరామకృష్ణ ద్వారా రూ.50 వేల చెక్కు ను కలెక్టర్‌కు అందజేశారు. దాతలందరికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-04-10T10:58:14+05:30 IST