కావ
లసిన పదార్థాలు: పచ్చి శనగపప్పు: కప్పు(గంట పాటునానపెట్టుకోవాలి), సొరకాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు, పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, మినపప్పు: టేబుల్ స్పూను, ఎండుమిర్చి: రెండు లేదా మూడు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు: కొద్దిగా.
కూటుకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము: చిన్న కప్పు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు, జీలకర్ర: టేబుల్ స్పూను, ధనియాలు: టేబుల్ స్పూను,
తయారీ విధానం: కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. శనగపప్పును కూడా మెత్తగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలను కూడా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత ఉడికిన శనగపప్పు, రుబ్బి పెట్టుకున్న కూటు ముద్ద అన్నీ కలిపి సొరకాయ ముక్కలకు జతచేయాలి. ఇవన్నీ ఉడుకుతున్న సమయంలోనే పసుపు, ఉప్పు కూడా జత చేసుకోవాలి. ఈ మిశ్రమం గట్టి పడుతున్న సమయంలో వేరొక బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత ఉడుకుతున్న సొరకాయ మిశ్రమానికి జత చేయాలి.