శెనగపండి పరాఠా

ABN , First Publish Date - 2018-04-28T21:50:15+05:30 IST

గోధుమపిండి-రెండుకప్పులు, ఉప్పు, వాము - ఒక్కొక్కటీ అర టీస్పూను చొప్పున, నెయ్యి-ఒక టేబుల్‌స్పూను...

శెనగపండి పరాఠా

కావలసినవి
 
గోధుమపిండి-రెండుకప్పులు, ఉప్పు, వాము - ఒక్కొక్కటీ అర టీస్పూను చొప్పున, నెయ్యి-ఒక టేబుల్‌స్పూను, నీళ్లు- అరకప్పు.ఫిల్లింగ్‌ కోసం: శెనగపిండి-ఒక కప్పు, ఉప్పు, వాము-ఒక్కొక్కటీ అర టీస్పూను చొప్పున, అల్లం-వెల్లుల్లి పేస్టు-కొద్దిగా, నల్లజీలకర్ర- ఒక టీస్పూను, పచ్చిమిర్చి-ఒకటి, కారం-అర టీస్పూను, ఉల్లిపాయ-ఒకటి, నిమ్మరసం-అర టీస్పూను, అచార్‌ మసాలా-ఒక టీస్పూను, ఆవనూనె-ఒక టీస్పూను, కొత్తిమీర-అరకప్పు.
 
తయారీవిధానం
 
గోధుమపిండి, ఉప్పు, వాము, నల్లజీలకర్ర, నెయ్యిలను ఒక గిన్నెలో వేయాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలపాలి. మరో గిన్నెలో శెనగపిండి, వాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం వేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిమ్మరసం, అచార్‌ మసాలా, నువ్వుల నూనె, కొత్తిమీర (తరుగు) వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోస్తే పిండి మెత్తగా అవుతుంది. ఈ పిండి ఫిల్లింగ్‌కు పనికొస్తుంది. ముందుగా కలుపుకున్న గోధుమపిండి ముద్దను చిన్న ఉండలు చేయాలి. ఈ ఉండల్ని చపాతీల్లా వత్తాలి. వీటి మధ్యలో ఫిల్లింగ్‌ మిశ్రమాన్ని పెట్టాలి. ఫిల్లింగ్‌ బయటకురాకుండా పిండిచల్లుతూ పరాఠాలు చేయాలి. రెండు వైపులా నెయ్యి రాసి పరాఠాలను బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. చిన్న మంటపై పరాఠాలు కాల్చితే రుచిగా ఉంటాయి. వేడి పరాఠాలు చట్నీ లేదా పెరుగుతో తింటే బాగుంటాయి.

Updated Date - 2018-04-28T21:50:15+05:30 IST