మామిడి మురబ్బా

ABN , First Publish Date - 2018-04-29T20:34:52+05:30 IST

మామిడికాయలు - ఒక కిలో, పంచదార - ఒకటిన్నర కిలో, ఉప్పు - ఒకటిన్నర టీ స్పూను, పసుపు...

మామిడి మురబ్బా

కావలసిన పదార్థాలు
 
మామిడికాయలు - ఒక కిలో, పంచదార - ఒకటిన్నర కిలో, ఉప్పు - ఒకటిన్నర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, ఉల్లి విత్తనాలు - ముప్పావు టీ స్పూను, వేగించిన జీలకర్ర (పొడి) - ముప్పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
ముందు మామిడి తొక్కు తీసి, సన్నగా తురుముకోవాలి. ఒక పాన్‌లో తురుముతో పాటు పంచదార వేసి సన్నని సెగమీద కలియబెడుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఉల్లి విత్తనాలు, జీరా పొడి కలపాలి. పంచదార తీగపాకం రాగానే మంట తీసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి. తేనెలా ఉండే మామిడి మురబ్బాతో వేడి వేడి పరాటాలు తింటే తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-04-29T20:34:52+05:30 IST