బేసిల్‌ బటర్‌ బ్రెడ్‌

ABN , First Publish Date - 2018-02-24T23:49:42+05:30 IST

బ్రెడ్‌ ప్యాకెట్‌- ఒకటి, పెద్ద వెల్లుల్లి రెబ్బలు- ఏడు, వెన్న (సాల్టెడ్‌)- ఒకటిన్నర టేబుల్‌స్పూను...

బేసిల్‌ బటర్‌ బ్రెడ్‌

కావలసినవి
 
బ్రెడ్‌ ప్యాకెట్‌- ఒకటి, పెద్ద వెల్లుల్లి రెబ్బలు- ఏడు, వెన్న (సాల్టెడ్‌)- ఒకటిన్నర టేబుల్‌స్పూను, తులసి ఆకులు- అరకప్పు, ఆలివ్‌ నూనె- అర టీస్పూను, ఉప్పు-చిటికెడు, ప్రాసెస్డ్‌ జున్ను (తురుము)- రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
వెల్లుల్లి రెబ్బల్ని పేస్టులా చేయాలి. తులసి ఆకుల్ని కడిగి చిటికెడు ఉప్పు వేసి మెత్తగా చేసివెల్లుల్లి పేస్టులో కలపాలి. ఈ మిశ్రమంలో అర టీస్పూను ఆలివ్‌ నూనె వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. చిన్న గిన్నె తీసుకుని అందులో కరగబెట్టిన వెన్న, తులసి, వెల్లుల్లి మిశ్రమాలు వేసి కలిపితే బేసిల్‌ బటర్‌ రెడీ. బ్రెడ్‌ను చదరపు ఆకారంలో ఒకే పరిమాణంలో ముక్కలుగా కట్‌ చేయాలి. తర్వాత బ్రెడ్‌ ముక్కలపై బేసిల్‌ బటర్‌ పూయాలి. సన్నగా తురిమిన జున్నును పైన వేయాలి. బ్రెడ్‌, చీజ్‌ రెండూ బంగారు రంగులోకి వచ్చేవరకూ ఒవెన్‌లో 200 సెంటిగ్రేడు వేడిపై పావుగంట బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. ఇలా తయారైన బేసిల్‌ బటర్‌ బ్రెడ్‌ను పాస్తాతో కలిపి తినొచ్చు. లేదా బేసిల్‌ బటర్‌ బ్రెడ్‌నే స్నాక్‌గా తీసుకోవచ్చు.

Updated Date - 2018-02-24T23:49:42+05:30 IST