కోల్డ్‌ కాఫీ

ABN , First Publish Date - 2016-02-26T17:25:17+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు- 2 కప్పులు, కోకో పౌడర్‌- 1 టేబుల్‌ స్పూను, ఇనస్టెంట్‌ కాఫీ పౌడర్‌ - 1/4 టీ స్పూను, కాఫీ డికాక్షన- అర కప్పు, పంచదార- రుచికి సరిపడా, ఫ్రెష్‌

కోల్డ్‌ కాఫీ

కావలసిన పదార్థాలు: పాలు- 2 కప్పులు, కోకో పౌడర్‌- 1 టేబుల్‌ స్పూను, ఇనస్టెంట్‌ కాఫీ పౌడర్‌ - 1/4 టీ స్పూను, కాఫీ డికాక్షన- అర కప్పు, పంచదార- రుచికి సరిపడా, ఫ్రెష్‌ క్రీం- 5 టీ స్పూన్లు, దాల్చినచెక్క పొడి- 1/4 టీ స్పూను, బాదం, పిస్తా తరుగు- 1 టీ స్పూను, ఐస్‌క్యూబ్‌లు- 1/2 కప్పు
తయారీ విధానం: పాలను కాచి చల్లార్చి రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో డికాక్షన, పాలు, పంచదార, రెండు మినహా మిగతా ఐస్‌క్యూబ్‌లు, కోకో పౌడర్‌ వేసి స్టీల్‌ లేదా ఎలక్ర్టిక్‌ బ్లండర్‌తో బాగా నురుగు వచ్చేవరకూ గిలకొట్టాలి(ఎలకి్ట్రక్‌ బ్లెండర్‌తో మంచి ఫలితం ఉంటుంది). ఆ తరువాత మరో గిన్నెలోకి క్రీంను తీసుకుని దానిలో రెండు ఐస్‌ క్యూబ్‌లు, సరిపడా పంచదార వేసి బాగా నురుగు వచ్చేవరకూ గిలకొట్టాలి. తరువాత కప్పులు తీసుకుని వాటిలో మూడు వంతులు పాల మిశ్రమం పోసి పైన క్రీం వేసి ఇనస్టెంట్‌ కాఫీ పౌడర్‌, దాల్చిన చెక్కపొడి, బాదం, పిస్తా తరుగు జల్లాలి.

Updated Date - 2016-02-26T17:25:17+05:30 IST