అరబిక్‌ స్టయిల్‌ చికెన్‌ కర్రీ

ABN , First Publish Date - 2015-08-26T22:34:15+05:30 IST

కావల్సినవి: బోన్‌లెస్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌(ముక్కలుగా కట్‌చేసినది) - 1కె.జి, నూనె - 4-5 టేబుల్‌స్పూన్లు

అరబిక్‌ స్టయిల్‌ చికెన్‌ కర్రీ

కావల్సినవి:  బోన్‌లెస్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌(ముక్కలుగా కట్‌చేసినది) - 1కె.జి, నూనె - 4-5 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు(పొట్టుతీసి ముక్కలుగా కట్‌చేసుకున్నవి) - 2
వెల్లుల్లి రేకలు - 4, , అల్లం ముద్ద - 1 టేబుల్‌స్పూన్‌, పసుపు - 1 టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినది), ఆల్మండ్స్‌ - 1/2 కప్పు, ఎండుద్రాక్ష - 1/2 కప్పు
టమాట(ముక్కలుగా కట్‌చేసుకున్నవి) - 4, నిమ్మరసం- రుచికితగినంత, నీళ్లు- చికెన్‌ను ఉడికించేందుకు సరిపోయేఅన్ని, ఉప్పు- రుచికి తగినంత
విధానం:
చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్‌పాన్‌లో నూనెవేసి వేడిచేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఆల్మండ్స్‌, అల్లం, పసుపు, కారంపొడి, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి ఎండుద్రాక్ష, టమాటో, నిమ్మరసం, కప్పు నీరు కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. తగినంత ఉప్పువేసి ఐదు నిమిషాలు ఉంచి దించుకోవాలి. వేడివేడి అన్నంతో ఈ కర్రీని వడ్డించడమే తరువాయి.

Updated Date - 2015-08-26T22:34:15+05:30 IST