మామిడి కాయ కోడికూర

ABN , First Publish Date - 2015-08-31T21:38:46+05:30 IST

కావలసిన పదార్థాలు: చికెన్‌ - అర కిలో, మామిడి ముక్కలు - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు

మామిడి కాయ కోడికూర

కావలసిన పదార్థాలు: చికెన్‌ - అర కిలో, మామిడి ముక్కలు - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, గరం మసాలా - అర టీస్పూను, కారం - టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగించాక మామిడి ముక్కలను కూడి దోరగా వేగించుకోవాలి. తరువాత చికెన్‌ ముక్కలను వేసి కాసేపు మగ్గాక అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కారం, ఉప్పు వేసి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించి తరువాత నీరుపోయాలి. కూర దగ్గర పడ్డాక దించేయాలి.

Updated Date - 2015-08-31T21:38:46+05:30 IST