అరటి దూట పచ్చడి

ABN , First Publish Date - 2015-08-26T21:38:57+05:30 IST

కావలసిన పదార్థాలు: దూట తరుగు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - 1 కప్పు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను

అరటి దూట పచ్చడి

కావలసిన పదార్థాలు: దూట తరుగు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - 1 కప్పు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము - 1 టీ స్పూను, అల్లం తరుగు - అర టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 2, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: పొరలన్నీ వలిచేసిన దూటను చక్రాల్లా తరిగి, పీచుని తీసి సన్నముక్కలుగా తరిగి నీటిలో సరిగ్గా 5 నిమిషాలు మాత్రం ఉడికించి వార్చేయాలి. కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో దూట తరుగు, కొబ్బరి పేస్టు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి విడిగా తాలింపు పెట్టుకుని దానిలో కలపాలి. (ఎక్కువ ప్రొటీన్లు కలిగిన ఈ పచ్చడి వారంలో ఒకసారైనా చేసుకుంటే మంచిది. దూట తరుగును నానబెట్టిన పచ్చిశనగ ప్పుతో కలిపి పొడి కూర కూడా వండుకోవచ్చు).

Updated Date - 2015-08-26T21:38:57+05:30 IST