మష్రూమ్‌ ఆవకాయ

ABN , First Publish Date - 2015-09-02T15:43:51+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ ముక్కలు- రెండు కప్పులు, ఆవాలు - రెండు టీస్పూన్లు

మష్రూమ్‌ ఆవకాయ

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ ముక్కలు- రెండు కప్పులు, ఆవాలు - రెండు టీస్పూన్లు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, మెంతులు - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, కారం రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మకాయ - ఒకటి, తాలింపు దినుసులు - ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్‌ను చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి కాగాక మష్రూమ్‌ ముక్కలను దోరగా వేగించి తీసుకోవాలి. మరో కడాయిలో నూనె లేకుండా ఆవాలు, జీలకర్ర, మెంతులను దోరగా వేగించి పొడిచేసుకోవాలి. ఒక గిన్నెలో మష్రూమ్‌ ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం కలపాలి. తరువాత తాలింపును కూడా కలిపి ఒక పూట ఊర బెట్టి తినాలి.

Updated Date - 2015-09-02T15:43:51+05:30 IST