ఇడ్లీ చాట్‌

ABN , First Publish Date - 2018-10-19T15:39:49+05:30 IST

చిన్న ఇడ్లీలు: సుమారు ఇరవై, నూనె:సరిపడ, స్వీట్‌ చట్నీ: రెండు స్పూన్లు, గ్రీన్‌ చట్నీ: రెండుస్పూన్లు...

ఇడ్లీ చాట్‌

కావలసిన పదార్థాలు
 
చిన్న ఇడ్లీలు: సుమారు ఇరవై, నూనె:సరిపడ, స్వీట్‌ చట్నీ: రెండు స్పూన్లు, గ్రీన్‌ చట్నీ: రెండుస్పూన్లు, నైలాన్‌ సేవ్‌: 50 గ్రాములు(ఇది స్వీట్‌ షాపుల్లో దొరుకుతుంది), గట్టి పెరుగు: రెండు లేదా మూడు స్పూన్లు, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, కారం పొడి: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, ఉల్లిపాయలు: ఒకటి లేదా రెండు(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: మూడు లేక నాలుగు(ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర: కొద్దిగా, చాట్‌ పొడి: టేబుల్‌ స్పూను, చింతపండు గుజ్జు: రెండు స్పూన్లు, బెల్లం: కొద్దిగా. నిమ్మరసం: టేబుల్ స్పూను.
 
తయారీ విధానం
 
ముందుగా చింపండు గుజ్జులో కొద్దిగా నీరు, బెల్లం కలిపి మరగనివ్వాలి. ఆ తరువాత దీనికి జీలకర్ర పొడి, ఉప్పు, కారంపొడి వేసి దించేయాలి. దీంతో స్వీట్‌ చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే గ్రీన్‌ చట్నీ కూడా రెడీ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు మెత్తగా నూరుకొని దీనికి ఉప్పు, నిమ్మరసం జత చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని మినీ ఇడ్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకుకోవాలి. పెరుగులో కొద్దిగా ఉప్పు, చాట్‌ మసాలా కలిపి వీటి మీద వేయాలి. చివరగా స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-10-19T15:39:49+05:30 IST