కాటేజి చీజ్‌ పకోడి

ABN , First Publish Date - 2018-09-12T23:01:45+05:30 IST

కాటేజీ చీజ్‌: కప్పు, మైదా పిండి: ఒకటిన్నర కప్పులు, బియ్యం పిండి: రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు...

కాటేజి చీజ్‌ పకోడి

కావలసిన పదార్థాలు
 
కాటేజీ చీజ్‌: కప్పు, మైదా పిండి: ఒకటిన్నర కప్పులు, బియ్యం పిండి: రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు: ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: నాలుగు లేదా ఐదు(ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: వేయించడానికి సరిపడ
 
తయారీ విధానం
 
పదార్థాలన్నీ బాగా కలుపుకుని అవసరమైతే కొద్దిగా నీరు పోసుకుంటూ పకోడి పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఓ పావుగంట పాటు నాననిచ్చి అనంతరం నూనెలో పకోడీలాగా వేయించుకోవాలి. మైదాపిండి ఇష్టపడని వారు ప్రత్యామ్నాయంగా శనగపిండి వాడుకోవచ్చు.

Updated Date - 2018-09-12T23:01:45+05:30 IST