తాటి ముంజల పాన్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-08-31T16:35:00+05:30 IST

కావలసిన పదార్థాలు: తాటిపండు గుజ్జు - 1 కప్పు, బొంబాయి రవ్వ - 1 కప్పు, బెల్లం - 1 కప్పు, పచ్చికొబ్బరి

తాటి ముంజల పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: తాటిపండు గుజ్జు - 1 కప్పు, బొంబాయి రవ్వ - 1 కప్పు, బెల్లం - 1 కప్పు, పచ్చికొబ్బరి కోరు - అరకప్పు, నూనె - 4 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: తాటిపండును నిప్పులపైగాని, స్టౌవ్‌పై గాని తిప్పుతూ కాల్చాలి. చల్లారిన తర్వాత తొక్క తీసేసి గుజ్జు పిండుకోవాలి. ఈ గుజ్జులో రవ్వ, బెల్లం, పచ్చికొబ్బరి కోరు కలిపి జారుగా చేసుకొని పెనంపై దళసరిగా దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. కాల్చినప్పుడు మంట చిన్నగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-31T16:35:00+05:30 IST