బూడిద గుమ్మడి పెరుగు చట్నీ

ABN , First Publish Date - 2015-08-30T20:17:26+05:30 IST

కావలసిన పదార్థాలు: గింజలు తీసిన బూడిద గుమ్మడి ముక్కలు- అరకప్పు, పెరుగు - 2 కప్పులు

బూడిద గుమ్మడి పెరుగు చట్నీ

కావలసిన పదార్థాలు: గింజలు తీసిన బూడిద గుమ్మడి ముక్కలు- అరకప్పు, పెరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, పసుపు - చిటికెడు, ఆవాలు - 1 టీ స్పూను, ఎండు మిర్చి - 1, మెంతులు- పావు టీ స్పూను, నూనె- 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: గుమ్మడి ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. కొబ్బరికోరు, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి (రుబ్బినప్పుడు నీటికి బదులు మజ్జిగ వాడాలి). ఉడికిన గుమ్మడి ముక్కల్లో గిలకొట్టిన పెరుగు, కొబ్బరి పేస్టు, ఉప్పు కలపాలి. తర్వాత ఆవాలు, మెంతులతో తాలింపు వేసి గుమ్మడి మిశ్రమంలో కలపాలి. ఈ పచ్చడి పరాటాలతోనే కాదు అన్నంలో కూడా బాగుంటుంది.; 

Updated Date - 2015-08-30T20:17:26+05:30 IST