చికెన్‌ రెక్కల స్నాక్స్‌

ABN , First Publish Date - 2015-08-30T18:44:42+05:30 IST

కావలసినవి: చికెన్‌ రెక్కలు - 8, వెల్లుల్లి - రెండు రేకలు, అల్లం - ఒక అంగుళం ముక్క,కారం - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

చికెన్‌ రెక్కల స్నాక్స్‌

కావలసినవి:  చికెన్‌ రెక్కలు - 8, వెల్లుల్లి - రెండు రేకలు, అల్లం - ఒక అంగుళం ముక్క,కారం - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ ముక్కలు -రెండు స్పూన్లు, గుడ్డు - ఒకటి, నూనె - 200 గ్రాములు, అజినామొటొ- చిటికెడు, టొమాటొ కెచప్‌ - ఒక స్పూను, వెనిగర్‌ - అర స్పూను, సోయాసాస్‌ - అర స్పూను, ఉప్పు- తగినంత
చేసే విధానం:
అల్లం వెల్లుల్లిని సన్నటి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. చికెన్‌ రెక్కలకు ఈ ముక్కలలో సగం, కొద్దిగా కారం, కొద్దిగామొక్కజొన్నపిండి, గుడ్డు, అజినామొటొ, ఉప్పు పట్టించి ఒక పావుగంట నాననివ్వాలి. ఆ తర్వాత నూనెలో ఎర్రగా వేగించాలి. మరొక పక్క మూకుడు పెట్టి దానిలోమిగిలిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లి ముక్కలు కొద్దిసేపు వేగించి ఆ తర్వాత ఒక కప్పునీళ్ళు, కారం, ఉప్పు సోయాసాస్‌, వెనిగర్‌, మొక్కజొన్న పిండి, అజినామొటొ వేసి ఒక నిమిషం ఉడికిస్తే చిక్కటి మిశ్రమం తయారవుతుంది. ఇందులో వేగించిన చికెన్‌ రెక్కలను వేసి ఒకసారి కలిపి వడ్డించండి. 

Updated Date - 2015-08-30T18:44:42+05:30 IST