ద్రాక్షావకాయ

ABN , First Publish Date - 2015-09-01T22:20:15+05:30 IST

కావాల్సిన పదార్థాలు: సీడ్‌లెస్‌ (పుల్ల)ద్రాక్షకాయలు - అరకిలో, ఆవపొడి - 1 టేబుల్‌ స్పూను, కారం

ద్రాక్షావకాయ

కావాల్సిన పదార్థాలు: సీడ్‌లెస్‌ (పుల్ల)ద్రాక్షకాయలు - అరకిలో, ఆవపొడి - 1 టేబుల్‌ స్పూను, కారం - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రేకలు - అర పాయ, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ద్రాక్షకాయల్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడిచి ఆరబెట్టి రెండు ముక్కలు(నిలువు)గా కోసుకోవాలి. ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్రపొడి, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతో పాటు సరిపడా నూనె పోసి బాగా కలపాలి. ఈ ద్రాక్షావకాయని ఒక జాడీలో ఉంచి మూతపెట్టాలి. మూడవ రోజుకి ద్రాక్షముక్కలు బాగా ఊరి సరిపడా ఊట వచ్చి పుల్లటి ద్రాక్షావకాయ రెడీ అవుతుంది.

Updated Date - 2015-09-01T22:20:15+05:30 IST