కరివేపాకు పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:40:27+05:30 IST

కావలసిన పదార్థాలు: కరివేపాకు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - ముప్పావు కప్పు

కరివేపాకు పచ్చడి

కావలసిన పదార్థాలు: కరివేపాకు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - ముప్పావు కప్పు, చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 3, ఇంగువ - చిటికెడు, వెల్లుల్లి రేకలు - 2, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: నూనెలో ఎండుమిర్చి, వెల్లుల్లి రెండు నిమిషాలు వేగించి కరివేపాకు, కొబ్బరి తురుము, ఇంగువ, చింతపండు గుజ్జు, ఉప్పు వేయాలి. 3 నిమిషాల తర్వాత మంట తీసేసి చల్లారిన తర్వాత మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో బాగుంటుంది. నెయ్యి కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T22:40:27+05:30 IST