కావ
లసిన పదార్థాలు: నూనె - 2 టీ స్పూన్లు, అవిశగింజలు - అరకప్పు, కరివేపాకు - ఒకట్నిర కప్పులు, శనగపప్పు - అరకప్పు, మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు, దనియాలు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 10, ఇంగువ - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న మూకుడులో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. అదే కడాయిలో అవిశగింజలు వేసి సన్నని మంటపై వేగిస్తూ (నువ్వుల్లా) చిటపటమనగానే తీసెయ్యాలి. తర్వాత కరివేపాకు పళపళమనేలా వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత పప్పులు, అవిశ గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇంగువ ఒకటి తర్వాత ఒకటి చేరుస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీ, దోశల్లోకి బాగుంటుంది.