బచ్చలికూర పచ్చడి

ABN , First Publish Date - 2015-08-29T23:45:34+05:30 IST

కావలసిన పదార్థాలు: బచ్చలికూర తరుగు - రెండు కప్పులు, చింతపండు - నాలుగు రెబ్బలు, ఎండుమిర్చి - నాలుగు

బచ్చలికూర పచ్చడి

కావలసిన పదార్థాలు: బచ్చలికూర తరుగు - రెండు కప్పులు, చింతపండు - నాలుగు రెబ్బలు, ఎండుమిర్చి - నాలుగు, మినప్పప్పు - ఒక టీస్పూను, శెనగపప్పు - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపుకోసం - ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, మినపప్పు, శెనగపప్పు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలోనే మరికాస్త నూనె పోసి కడిగి ఆరబెట్టుకున్న బచ్చలి కూరను వేసి నీరు ఇగిరే వరకూ మగ్గనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారాక అందులో వేగించి పెట్టుకున్న పోపు, చింత పండు గుజ్జు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. తర్వాత పచ్చడికి తాలింపు వేసుకోవాలి.

Updated Date - 2015-08-29T23:45:34+05:30 IST