బెల్లం మామిడి పచ్చడి

ABN , First Publish Date - 2015-08-29T23:50:14+05:30 IST

కావలసిన పదార్థాలు: తోతాపురి మామిడి తురుము -2 కాయలవి, మెంతులు - 1 టీ స్పూను, ఎండు మిర్చి- 10

బెల్లం మామిడి పచ్చడి

కావలసిన పదార్థాలు: తోతాపురి మామిడి తురుము -2 కాయలవి, మెంతులు - 1 టీ స్పూను, ఎండు మిర్చి- 10, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, ఉప్పు, బెల్లం - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:మెంతుల్ని, ఎండుమిర్చిని గ్రైండ్‌ చేసుకుని, అదే జారులో బెల్లం, ఉప్పు, తురుము వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు చిటపటమన్నాక మామిడి మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేదాకా సన్నని మంటపైన వేగించాలి. చల్లారాక గాలి చొరబడని జాడీలో భద్రపరిస్తే నెలరోజుల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:50:14+05:30 IST