బనానా-టొమాటో- క్యాబేజి సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-29T16:03:40+05:30 IST

కావలసిన పదార్థాలు: అరటిపండు - 1, టొమాటో - 1, క్యాబేజి ఆకులు (పెద్దవి) - 2, నిమ్మరసం - 1 టీ స్పూన్‌ మిరియాల పొడి, ఉప్పు - రుచికి తగినంత

బనానా-టొమాటో- క్యాబేజి సలాడ్‌

కావలసిన పదార్థాలు: అరటిపండు - 1, టొమాటో - 1, క్యాబేజి ఆకులు (పెద్దవి) - 2, నిమ్మరసం - 1 టీ స్పూన్‌ మిరియాల పొడి, ఉప్పు - రుచికి తగినంత
తయారుచేసే విధానం: ముందుగా అరటిపండు, టొమాటోలను చిన్న ముక్కలుగా కోసి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. దానికి నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు చేర్చాలి. ఒక క్యాబేజి ఆకును సన్నని చీలికల్లా కోసి మధ్యలో చల్లాలి. ఈ మొత్తాన్ని మరో క్యాబేజి ఆకులోకి సర్దుకుని ప్లేట్‌లో ఉంచుకోవాలి. అంతే - అరటిపండు-టొమాటో-క్యాబేజి సలాడ్‌ తయారైనట్లే.

Updated Date - 2015-11-29T16:03:40+05:30 IST