బీట్‌రూట్‌- ఆరెంజ్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-26T13:56:52+05:30 IST

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ - 1, కమలాపండ్లు - 2, పంచదార - 1 టీ స్పూన్‌, యాలకుల పొడి - అర టీ

బీట్‌రూట్‌- ఆరెంజ్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ - 1, కమలాపండ్లు - 2, పంచదార - 1 టీ స్పూన్‌, యాలకుల పొడి - అర టీ స్పూన్‌, నిమ్మరసం - ఒక టీ స్పూన్‌

తయారుచేసే విధానం:
ముందుగా బీట్‌రూట్‌ను ఉడికించి చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి. కమలాపండు తొనలు తీసి వాటిని సగానికి కోసి బీట్‌రూట్‌ ముక్కలున్న ప్లేట్‌లో వేయాలి. దీనికి నిమ్మరసం చేర్చాలి. పంచదార, యాలకుల పొడి కలిపి పైన చల్లాలి. చివర్లో కమలాపండు తొక్కను సన్నని చీలికల్లా కోసి మధ్యలో అమర్చాలి. దీనిని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2015-11-26T13:56:52+05:30 IST